'భోళా శంకర్': పేరుకే రీమేక్ సినిమా..!
ABN , First Publish Date - 2021-11-12T14:01:51+05:30 IST
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'భోళా శంకర్'. తమిళ సూపర్ హిట్ 'వేదాళమ్' మూవీకి రీమేక్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'భోళా శంకర్'. తమిళ సూపర్ హిట్ 'వేదాళమ్' మూవీకి రీమేక్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. తమన్నా హీరోయిన్‌గా, కీర్తి సురేశ్ మెగాస్టార్‌కు సోదరిగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓపెనింగ్ జరిగింది. ఈ నెల 15నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. అయితే, ఇది పేరుకే రీమేక్ సినిమా గానీ..దాదాపు స్క్రిప్ట్ మొత్తం మార్చి ఒరిజినల్ సినిమా కథగా తయారు చేసినట్టు టాక్ వినిపిస్తోంది.
ఈ మార్పులు చేసేందుకు దర్శకుడు మెహర్ రమేశ్ ఏడాదిన్నరకు పైగానే సమయం తీసుకున్నాడట. పక్కాగా స్క్రిప్ట్ సిద్దమయ్యాకే సెట్స్ మీదకు రాబోతున్నారు. అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఇందులో రఘుబాబు, రావు రమేశ్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిశోర్, తులసి ,ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఇతర ముఖ్యపాత్రలలో కనిపించబోతున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
