'భీమ్లా నాయక్': రిలీజ్ డేట్‌తో కొత్త పోస్టర్ ..వెనక్కి తగ్గేదే లే

ABN , First Publish Date - 2021-11-16T16:10:35+05:30 IST

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా సాగర్ కె చంద్ర రూపొందిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భీమ్లా నాయక్'. మరోసారి అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ను కన్‌ఫర్మ్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం.

'భీమ్లా నాయక్': రిలీజ్ డేట్‌తో కొత్త పోస్టర్ ..వెనక్కి తగ్గేదే లే

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా సాగర్ కె చంద్ర రూపొందిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భీమ్లా నాయక్'. మరోసారి అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ను కన్‌ఫర్మ్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుం కోషియుం'కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్.. రానా దగ్గుబాటి సరన సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకి సూర్యదేవర నాగ వంశీ నిర్మాత. అయితే, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్' జనవరి 7న రిలీజ్ చేస్తుండటంతో  'భీమ్లా నాయక్' పోస్ట్‌పోన్ చేస్తారనే రూమర్స్ వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో ఎట్టిపరిస్థితూలోనూ ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేసే సమస్యే లేదని క్లారిటీ ఇస్తూ 2022, జనవరి 12నే ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను వదిలారు. కాగా, మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తుండగా, ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. Updated Date - 2021-11-16T16:10:35+05:30 IST