భీమ్లానాయక్‌: పవర్‌ఫుల్‌ అప్‌డేట్‌!

ABN , First Publish Date - 2021-12-28T23:15:56+05:30 IST

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘భీమ్లానాయక్‌’ నుంచి బుధవారం ఓ సర్‌ప్రైజ్‌ బయటకు రానుంది. ఇప్పటి వరకూ ఈ చిత్రం నుంచి వచ్చిన ‘టైటిల్‌ సాంగ్‌, ‘లాలా..భీమ్లా’తోపాటు మాస్‌ లుక్‌ పోస్టర్‌లకు విపరీతమైన రెస్సాన్ప్‌ వచ్చిన సంగతి తెలిసిందే! పాటలైతే యూట్యూబ్‌ ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం బుధవారం మరో పాటతో అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది

భీమ్లానాయక్‌: పవర్‌ఫుల్‌ అప్‌డేట్‌!

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘భీమ్లానాయక్‌’ నుంచి బుధవారం ఓ సర్‌ప్రైజ్‌ బయటకు రానుంది.  ఇప్పటి వరకూ ఈ చిత్రం నుంచి వచ్చిన ‘టైటిల్‌ సాంగ్‌, ‘లాలా..భీమ్లా’తోపాటు మాస్‌ లుక్‌ పోస్టర్‌లకు విపరీతమైన రెస్సాన్ప్‌ వచ్చిన సంగతి తెలిసిందే! పాటలైతే యూట్యూబ్‌ ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం బుధవారం మరో పాటతో అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది. రేపు 11 గంటలకు ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక పాటను చిత్రబృందం విడుదల చేయనుంది. ఈ విషయాన్ని చిత్న నిర్మాత నాగ వంశీ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. సంక్రాంతి కానుకగా వచ్చే నెల 12న విడుదల కావలసిన ఈ చిత్రం పలు కారణాల వల్ల ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పవన్‌కల్యాణ్‌, రానా హీరోలుగా సాగర్‌.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. త్రివిక్రమ్‌ మాటలు, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు.


Updated Date - 2021-12-28T23:15:56+05:30 IST