కామెడీ కథతో ‘ భళా చోర భళా’
ABN , First Publish Date - 2021-12-29T05:38:35+05:30 IST
ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ ముఖ్య పాత్రధారులుగా రూపుదిద్దుకుంటున్న ‘భళా చోర భళా’ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది....

ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ ముఖ్య పాత్రధారులుగా రూపుదిద్దుకుంటున్న ‘భళా చోర భళా’ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఎ ప్రదీప్ దర్శకత్వంలో జననీ ప్రదీప్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. చిత్రం వివరాలను దర్శకుడు ప్రదీప్ వివరిస్తూ ‘పుల్ లెంగ్త్ కామెడీ, మిస్టరీ అంశాలతో తెరకెక్కిస్తున్నాం. మంచి ఆర్టిస్టులు కుదిరారు. మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో విడుదల చేస్తాం. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా సినిమా ఉంటుంది’ అని చెప్పారు. శాంతి దేవగుడి, రామ్‌జగన్, చిత్రం శ్రీను, వెంకటేశ్, రవికిరణ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: లక్ష్మణ్, సంగీతం: సింహా కొప్పర్తి, వెంకటేశ్ అద్దంకి.