భాగ్ సాలే!
ABN , First Publish Date - 2021-02-24T09:59:27+05:30 IST
సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహ హీరోగా రూపొందనున్న క్రైమ్ కామెడీ సినిమా ‘భాగ్ సాలే’....
సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహ హీరోగా రూపొందనున్న క్రైమ్ కామెడీ సినిమా ‘భాగ్ సాలే’. మంగళవారం హీరో పుట్టినరోజు సందర్భంగా సినిమా ప్రకటించడంతో పాటు టైటిల్ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. కీరవాణి మరో తనయుడు కాలభైరవ సంగీతం అందించనున్న ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మార్చి మూడో వారంలో ప్రారంభం కానుందని నిర్మాతలు తెలిపారు. ఇది కొత్త తరహా చిత్రమని, కంటెంట్ ఉన్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని దర్శకుడు చెప్పారు.
నిర్మాణ సంస్థలు: మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్ బెన్ సినిమాస్,
సమర్పణ: డి. సురేశ్‌బాబు,
దర్శకుడు: ప్రణీత్ బ్రమాండపల్లి,
నిర్మాతలు: ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి, యశ్ రంగినేని.
శ్రీ సింహ హీరోగా నటిస్తున్న రెండో సినిమా ‘తెల్లవారితే గురువారం’ సినిమాను మార్చి 27న విడుదల చేయనున్నట్టు మంగళవారం ప్రకటించారు. మణికాంత్ గెల్లి దర్శకత్వంలో రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన చిత్రమిది.