టాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న నిర్మాత తనయుడు

ABN , First Publish Date - 2021-01-03T05:06:09+05:30 IST

హీరోల కుమారులే కాదు.. నిర్మాతల తనయులు కూడా టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్నారు. అలాంటి వారిలో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకరు. తక్కువ సమయంలోనే తెలుగులో

టాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న నిర్మాత తనయుడు

హీరోల కుమారులే కాదు.. నిర్మాతల తనయులు కూడా టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్నారు. అలాంటి వారిలో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకరు. తక్కువ సమయంలోనే తెలుగులో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ఆరడుగులకు పైగా హైట్ తో.. ఆన్ స్క్రీన్ పై డాన్స్, ఫైట్స్ లో దుమ్మురేపే బెల్లంకొండ శ్రీనివాస్.. ఇప్పుడు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద రైజింగ్ హీరో. నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా చిత్ర సీమలోకి ప్రవేశించి.. అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించాడు శ్రీనివాస్. ఆరేళ్ల కాలంలో ఏడు సినిమాలను ప్రేక్షకుల ముందు నిలిపిన ఈ యంగ్ హీరో.. హిట్స్, ఫ్లాప్స్ తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంటాడు. జనవరి 3 బెల్లంకొండ శ్రీనివాస్ బర్త్ డే.


తొలి చిత్రం 'అల్లుడు శీను'తో హిట్‌ అందుకున్నాడు శ్రీనివాస్. ఇప్పుడు అదే టైటిల్ సెంటిమెంట్‌ ను సంతోష్ శ్రీనివాస్ సినిమాకి ఫాలో అవుతున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్-సంతోష్ శ్రీనివాస్ కలయికలో రూపొందిన 'అల్లుడు అదుర్స్‌'.. సంక్రాంతి కానుకగా ఈనెల 15న విడుదలకాబోతుంది. ఇక.. తెలుగులోనే కాకుండా తన అనువాద చిత్రాలతో హిందీ ఆడియెన్స్ లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించాడు సాయి శ్రీనివాస్. అందుకే.. ఈసారి 'ఛత్రపతి' రీమేక్ తో బాలీవుడ్ లో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'ఛత్రపతి' హిందీ రీమేక్ తెరకెక్కబోతుంది. మొత్తంమీద.. ఈ అప్ కమింగ్ మూవీస్ బెల్లంకొండకు ఎలాంటి విజయాల్ని అందిస్తాయో చూడాలి.



Updated Date - 2021-01-03T05:06:09+05:30 IST