ఖాళీగా ఉంటే అదే ఇబ్బంది!
ABN , First Publish Date - 2021-08-29T05:50:29+05:30 IST
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస చిత్రాలతో బిజీగా మారారు పూజాహెగ్డే. సినిమా చిత్రీకరణల కోసం విమానాల్లో నగరాలు చుట్టేస్తున్నారు. ప్రస్తుతం పూజాహెగ్డే చిత్రీకరణలకు చిన్న బ్రేక్ ...

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస చిత్రాలతో బిజీగా మారారు పూజాహెగ్డే. సినిమా చిత్రీకరణల కోసం విమానాల్లో నగరాలు చుట్టేస్తున్నారు. ప్రస్తుతం పూజాహెగ్డే చిత్రీకరణలకు చిన్న బ్రేక్ ఇచ్చారు. అయితే నిత్యం చిత్రీకరణలతో బిజీగా ఉండడం అలవాటయింది. కాస్త ఖాళీ దొరికితే మూడీగా ఉందని అంటున్నారు పూజా. ఖాళీ సమయంలో ఇంట్లో సేదతీరుతున్న తన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘పనేం లేకపోతే చాలా మూడీగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.