విజయ్‌ దేవరకొండకు బీరాభిషేకం చేసిన ఫ్యాన్స్‌

ABN , First Publish Date - 2021-01-19T14:22:32+05:30 IST

క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'లైగర్‌' అనే టైటిల్‌ను ఖరారు చేసి అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే.

విజయ్‌ దేవరకొండకు బీరాభిషేకం చేసిన ఫ్యాన్స్‌

క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'లైగర్‌' అనే టైటిల్‌ను ఖరారు చేసి అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఈ లుక్‌పై అమేజింగ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు ఫ్యాన్స్ రచ్చ మొదలైంది. సాధారణంగా తమ అభిమాన హీరో సినిమా విడుదలవుతుందంటే అభిమానులు పెద్ద కటౌట్స్‌ పెడతారు. అలాగే పాలాభిషేకం చేస్తారు. అయితే విజయ్‌ దేవరకొండ అభిమానులు విజయ్‌ దేవరకొండ ఫస్ట్‌లుక్‌కు బీరుతో అభిషేకం చేశారు. ఆ వీడియోను ఛార్మి తన ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేసింది. 'రచ్చ మొదలైంది' అంటూ మెసేజ్‌ కూడా పోస్ట్‌ చేసింది ఛార్మి. నెటిజన్స్‌లో కొందరు ఈ రచ్చ మామూలుగా ఉండదు అని అంటుంటే.. మరికొందరు మాత్రం ఎక్కువ చేస్తున్నారు అని అంటున్నారు. 
Updated Date - 2021-01-19T14:22:32+05:30 IST