తండ్రి పాట.. కొడుకు కామెంట్‌!

ABN , First Publish Date - 2021-11-09T18:48:12+05:30 IST

‘సోగ్గాడే చిన్ని నాయనా’లో ‘బంగార్రాజు’గా అలరించారు అక్కినేని నాగార్జున. తాజాగా మరోసారి అల్లరి చేయడానికి సిద్ధమవుతున్నారాయన. నాగార్జున హీరోగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. మంగళవారం ఈ చిత్రం నుంచి ‘లడ్డుండా’ లిరికల్‌ పాటను నాగార్జున సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు.

తండ్రి పాట.. కొడుకు కామెంట్‌!

‘సోగ్గాడే చిన్ని నాయనా’లో ‘బంగార్రాజు’గా అలరించారు అక్కినేని నాగార్జున. తాజాగా మరోసారి అల్లరి చేయడానికి సిద్ధమవుతున్నారాయన. నాగార్జున హీరోగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. మంగళవారం ఈ చిత్రం నుంచి  ‘లడ్డుండా’ లిరికల్‌ పాటను నాగార్జున సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. ధనుంజయ్‌, మోహన బోగరాజు, హరిప్రియ, నూతన్‌ మోహన్‌ ఆలపించిన ఈ పాటకు ‘అబ్బాయ్‌ హార్మోనీ.. డంటకు డడనా’ అంటూ నాగార్జున కూడా గొంతు కలిపారు. పాటకు ముందు వచ్చే సాకీని నాగార్జున తనదైన యాసలో హుషారుగా ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియోను నాగచైతన్య ట్విట్టర్‌లో షేర్‌ చేసి ‘‘నాన్నా.. నీ ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్‌ చేయలేరు’’ అని ట్వీట్‌ చేశారు. ఇందులో నాగార్జునతోపాటు నాగచైతన్య కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ.. చైతన్యకు జోడీగా కృతిశెట్టి సందడి చేయనున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరకర్త. జీ స్టూడియోస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
Updated Date - 2021-11-09T18:48:12+05:30 IST