సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘బంగార్రాజు’: మైసూరులో కొత్త షూటింగ్ షెడ్యూల్‌..

ABN, First Publish Date - 2021-11-09T13:57:35+05:30

అక్కినేని నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంకు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర తాజా షెడ్యూల్ మైసూరులో ప్రారంభం అయినట్టు తెలుస్తోంది. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఇందులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కినేని నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంకు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర తాజా షెడ్యూల్ మైసూరులో ప్రారంభం అయినట్టు తెలుస్తోంది. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఇందులో నాగార్జున తనయుడు నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నాడు. నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా, నాగ చైతన్య సరసన హీరోయిన్‌గా 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తైంది. ఈ క్రమంలోనే తాజా షెడ్యూల్‌ను చిత్రబృందం మైసూరులో ప్రారంభించింది. ఇక ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అనూప్ రుబెన్స్ దీనికి సంగీత దర్శకుడు. 

Updated Date - 2021-11-09T13:57:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!