Bangarraju: అక్కినేని హీరోలతో ఫరియా అబ్దుల్లా స్పెషల్ నంబర్..

ABN , First Publish Date - 2021-12-14T16:53:08+05:30 IST

అక్కినేని హీరోలు నాగార్జున - నాగ చైతన్య కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'బంగార్రాజు'. ఈ సినిమాలో 'జాతిరత్నాలు' బ్యూటీ ఫరియా అబ్దులా స్పెషల్ నంబర్‌లో కనిపించబోతోంది.

Bangarraju: అక్కినేని హీరోలతో ఫరియా అబ్దుల్లా స్పెషల్ నంబర్..

అక్కినేని హీరోలు నాగార్జున - నాగ చైతన్య కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'బంగార్రాజు'. ఈ సినిమాలో 'జాతిరత్నాలు' బ్యూటీ ఫరియా అబ్దులా స్పెషల్ నంబర్‌లో కనిపించబోతోంది. యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో 2019లో వచ్చి భారీ కమర్షియల్ హిట్ సాధించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి కొనసాగింపుగా 'బంగార్రాజు' రూపొందుతోంది. ఇందులో నాగ్ సరసన రమ్యకృష్ణ, చైతు సరసన కృతిశెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే 'బంగార్రాజు' చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్, 'నాకోసం' సాంగ్ మంచి అంచనాలను పెంచాయి. ఆ అంచనాలను మరింతగా పెంచేందుకు ఇందులో యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా నర్తించిన స్పెషల్ నంబర్‌కు సంబంధించిన సాంగ్ అనౌన్స్‌మెంట్ వీడియోను, పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.


ఈ సాంగ్‌లో ఫరియా.. నాగార్జున - నాగ చైతన్యలతో కలిసి చిందులేసింది. ఈ సాంగ్‌కు సంబంధించిన టీజర్‌ను డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. మరి ఈ మాస్ సాంగ్ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. 



Updated Date - 2021-12-14T16:53:08+05:30 IST