Bandla Ganesh: డేగల బాబ్జీగా...
ABN , First Publish Date - 2021-09-17T23:52:55+05:30 IST
‘డేగల బాబ్జీ’గా బండ్ల గణేశ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ... స్వాతి చంద్ర నిర్మిస్తున్న చిత్రంతో ఆయన హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ‘డేగల బాబ్జీ’ టైటిల్ ఖరారు చేశారు. శుక్రవారం హరీశ్ శంకర్ టైటిల్ పోస్టర్ ఆవిష్కరించారు.
‘డేగల బాబ్జీ’గా బండ్ల గణేశ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ... స్వాతి చంద్ర నిర్మిస్తున్న చిత్రంతో ఆయన హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ‘డేగల బాబ్జీ’ టైటిల్ ఖరారు చేశారు. శుక్రవారం హరీశ్ శంకర్ టైటిల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ ‘‘బండ్ల గణేశ్‌గారి ఫస్ట్‌లుక్, టైటిల్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. సినిమా సైతం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఈ నెల తొలి వారంలో ప్రారంభించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది’’ అని తెలిపారు.