చెక్ బౌన్స్ కేసులో.. కోర్టుకి హాజరైన బండ్ల గణేష్

ABN , First Publish Date - 2021-12-27T20:55:41+05:30 IST

నటుడిగా, నిర్మాతగా బండ్ల గణేష్ ఎంత ఫేమస్సో.. వివాదాల విషయంలోనూ ఆయన అంతే ఫేమస్. ఆ మధ్య హీరో సచిన్ జోషి విషయంలో కోర్టు వరకు వెళ్లిన బండ్ల గణేష్.. మళ్లీ ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులో కోర్టు మెట్లెక్కాడు. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు లోని

చెక్ బౌన్స్ కేసులో.. కోర్టుకి హాజరైన బండ్ల గణేష్

నటుడిగా, నిర్మాతగా బండ్ల గణేష్ ఎంత ఫేమస్సో.. వివాదాల విషయంలోనూ ఆయన అంతే ఫేమస్. ఆ మధ్య హీరో సచిన్ జోషి విషయంలో కోర్టు వరకు వెళ్లిన బండ్ల గణేష్.. మళ్లీ ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులో కోర్టు మెట్లెక్కాడు. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు లోని జిల్లా సివిల్ అండ్ సెషన్స్ కోర్టుకి సోమవారం బండ్ల గణేష్ హాజరయ్యారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి బండ్ల గణేష్ ఇచ్చిన కోటి రూపాయల చెక్.. బౌన్స్ అవ్వడంతో ఆయన కోర్టుని ఆశ్రయించాడు. ఈ విషయమై నేడు బండ్ల గణేష్ కోర్టుకి హాజరయ్యాడు. ఆయన కారు దిగి లాయర్లతో కలిసి కోర్టుకు వెళుతున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2021-12-27T20:55:41+05:30 IST