గ్లామర్ పాత్రలకు అవికా గోర్ గ్రీన్ సిగ్నల్
ABN , First Publish Date - 2021-01-19T19:04:56+05:30 IST
తొలి సినిమా నుండి అవికాగోర్ ఎక్కడా గ్లామర్ పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపించలేదు. కానీ ఇప్పుడు అవికా గ్లామర్ పాత్రల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

'బాలికా వధు'.. అదేనండి 'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్‌తో ప్రేక్షకులకు బాలనటిగా తెలుగు ప్రేక్షకులను పలకరించిన అవికాగోర్.. ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రం సెన్సేషనల్ హిట్ కావడంతో అవికా గోర్‌కు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. సినిమా చూపిస్త మావ, తను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమాల్లో కాస్త బొద్దుగా కనపడిన అవికాగోర్.. సినిమాల నుండి కాస్త బ్రేక్ తీసుకుంది. ఒకవైపు అమెరికాలో సినిమా షార్ట్ టర్మ్‌కోర్స్‌ను పూర్తి చేసింది. తర్వాత 'రాజుగారిగది3' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది అవికా గోర్. ఫిట్‌నెస్‌ఫై ఫోకస్ పెట్టింది. సన్నగా, నాజుకుగా తయారైంది. ఎంతలా అంటే అవికా గోర్ లుక్ చూసినవారు అబ్బో అనుకునేంతగా..
తొలి సినిమా నుండి అవికాగోర్ ఎక్కడా గ్లామర్ పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపించలేదు. ఆమె పోషించే క్యారెక్టర్స్‌ను చూసిన ప్రేక్షకులు అవికాగోర్‌లో సౌందర్యను చూస్తామేమో అని కూడా అనుకున్నారు. కానీ లుక్‌పై ఫోకస్ పెట్టి రూటు మార్చిన అవికా గోర్ ఇప్పుడు కమర్షియల్ సినిమాల్లో నటించడానికి ఓకే అయ్యింది. ఏదైతేనేం.. నేను కూడా గ్లామర్ పాత్రల్లో నటించడానికి సిద్ధం అంటూ రీసెంట్‌గా సోషల్ మీడియాలో స్విమ్మింగ్ పూల్ పక్కన బికినీతో పోస్ట్ చేసిన ఫొటోతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతే కాదండోయ్.. ఐటెమ్ సాంగ్స్‌లోనూ నటించడానికి సై అంటోంది. అదేంటమ్మా.. అని అడిగితే కత్రినా, ప్రియాంక, తమన్నా ఇలా చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఐటెమ్ సాంగ్స్‌లో నటించారుగా.. నేను కూడా వారి బాటలోనే అని అంటోంది ముద్దుగుమ్మ అవికా గోర్.