సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

జర్నలిస్ట్‌గా అవికాగోర్‌

ABN, First Publish Date - 2021-05-04T16:53:19+05:30

అవికాగోర్‌ జర్నలిస్ట్‌గా మారనుందా? అంటే అవుననే సమాధానం సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే రియల్‌ లైఫ్‌లో కాదు.. రీల్‌పైనే అని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవికాగోర్‌ జర్నలిస్ట్‌గా మారనుందా? అంటే అవుననే సమాధానం సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే రియల్‌ లైఫ్‌లో కాదు.. రీల్‌పైనే అని అంటున్నారు. వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం ఆదిసాయికుమార్‌తో సజ్జా వెంకటేశ్వరరావు నిర్మిస్తోన్న చిత్రం 'అమరన్‌ ఇన్‌ ది సిటీ చాప్టర్‌1'లో అవికాగోర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. బల్‌వీర్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలోఈమె జర్నలిస్ట్‌ పాత్రలో కనిపిస్తుంది. ఓ  కేసుని అవికాగోర్‌ శోధిస్తున్న సమయంలో ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే సినిమా కథాంశం. 'ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్తమావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అవికాగోర్‌ మధ్యలో సినిమాకు కాస్త బ్రేక్‌ తీసుకుంది. ఆ తర్వాత 'రాజుగారి గది3' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. అంతే కాదండోయ్‌ కెరీర్‌ ప్రారంభంలో బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య సన్నబడింది కూడా. 

Updated Date - 2021-05-04T16:53:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!