అతిథి దేవోభవ
ABN, First Publish Date - 2021-09-02T05:38:41+05:30
ఆది సాయికుమార్ హీరోగా రాజబాబు మిర్యాల, అశోక్‌రెడ్డి మిర్యాల నిర్మించిన చిత్రం ‘అతిఽథి దేవోభవ’. ఫస్ట్ లుక్ విడుదల చేసిన శివ నిర్వాణ, సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు....
ఆది సాయికుమార్ హీరోగా రాజబాబు మిర్యాల, అశోక్‌రెడ్డి మిర్యాల నిర్మించిన చిత్రం ‘అతిఽథి దేవోభవ’. ఫస్ట్ లుక్ విడుదల చేసిన శివ నిర్వాణ, సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ‘‘తప్పకుండా ఇదొక మంచి కాన్సెప్ట్ బేస్డ్ సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. పాటలతో సహా చిత్రీకరణ మొత్తం పూర్తి చేశాం. డబ్బింగ్ దాదాపు పూర్తయింది. ప్రతిరోజూ సెట్‌లో ఉంటూ ఎంతో జాగ్రత్త తీసుకుని నిర్మాత రాజబాబు సినిమా చేశారు. శేఖర్ చంద్రగారు సూపర్ సాంగ్స్ ఇచ్చారు’’ అని ఆది సాయికుమార్ చెప్పారు. ‘‘ప్రతిఒక్కరూ కనెక్టయ్యే చక్కటి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. పాటలకు మంచి సందర్భాలు కుదిరాయి’’ అని సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి, చిత్రదర్శకుడు పొలిమేర నాగేశ్వర్, గేయ రచయిత భాస్కరభట్ల, కథారచయిత కె. వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.