‘అతిధి దేవోభవ’ ప్రేమ పాట
ABN , First Publish Date - 2021-09-28T00:01:29+05:30 IST
ఆది సాయికుమార్, నువేక్ష జంటగా నటిస్తున్న చిత్రం ‘అతిధి దేవోభవ’. పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘బాగుంటుంది నువ్వు నవ్వితే’ అంటూ సాగే ప్రేమపాటను సోమవారం విడుదల చేశారు.
ఆది సాయికుమార్, నువేక్ష జంటగా నటిస్తున్న చిత్రం ‘అతిధి దేవోభవ’. పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘బాగుంటుంది నువ్వు నవ్వితే’ అంటూ సాగే ప్రేమపాటను సోమవారం విడుదల చేశారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్, నూతన మోహన్ ఆలపించారు. శేఖర్ చంద్ర బాణీలందించారు. ప్రస్తుతం ఈ పాటను యూట్యూబ్లో అలరిస్తోంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు వెల్లడించాం.