బ్రేక్‌ టైమ్‌లో... భీమ్లా నాయక్‌!

ABN , First Publish Date - 2021-08-22T05:45:16+05:30 IST

‘యోగి కమండలం కొమ్ములోంచి చెట్టుకి ప్రాణధార వదుల్తాడు. యోధుడు తుపాకి గొట్టం అంచునుంచి ప్రకృతికి వత్తాసు పలుకుతాడు...

బ్రేక్‌ టైమ్‌లో... భీమ్లా నాయక్‌!

‘యోగి కమండలం కొమ్ములోంచి చెట్టుకి ప్రాణధార వదుల్తాడు. యోధుడు తుపాకి గొట్టం అంచునుంచి ప్రకృతికి వత్తాసు పలుకుతాడు. నాయకుడు ఈ రెండింటినీ తన భుజాన మోసుకుంటూ ముందుకు కదుల్తాడు’ అని ‘భీమ్లా నాయక్‌’ చిత్రబృందం పేర్కొంది. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. విరామ సమయంలో పవన్‌ తుపాకి చేతబట్టి బులెట్ల వర్షం కురిపించారు. ఆ సందర్భంలో తీసిన వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ‘బ్రేక్‌ టైమ్‌లో భీమ్లా నాయక్‌ స్టయిల్‌లో’ అని పేర్కొంది. సినిమాలో తొలి పాటను పవన్‌ పుట్టినరోజైన సెప్టెంబర్‌ 2న విడుదల చేయనున్నారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న సినిమా విడుదల కానుంది. త్రివిక్రమ్‌ సంభాషణలు, స్ర్కీన్‌ప్లే అందిస్తుండగా... సాగర్‌ కె. చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.


Updated Date - 2021-08-22T05:45:16+05:30 IST