వల్గర్ వర్మ వలలో మరో భామ
ABN, First Publish Date - 2021-08-19T21:31:49+05:30
ఒకప్పుడు టాప్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఇప్పుడు.. పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే? పబ్లిసిటీ కోసం ఎలాంట స్టంట్స్ చేయడానికైనా ఆయన సిద్ధమే! అందుకే ఇటీవల కాలంలో వర్మ సినిమాలకు, చేసే చేష్టలకు అర్థాలే వేరు అని టాక్ గట్టిగా వినిపిస్తోంది.
ఒకప్పుడు టాప్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఇప్పుడు.. పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే? పబ్లిసిటీ కోసం ఎలాంట స్టంట్స్ చేయడానికైనా ఆయన సిద్ధమే! అందుకే ఇటీవల కాలంలో వర్మ సినిమాలకు, చేసే చేష్టలకు అర్థాలే వేరు అని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఒక సమస్యపై పదిమంది ఒకలా ఆలోచిస్తే వర్మ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించి భిన్నమైన కామెంట్లు చేసి వార్తల్లో నిలుస్తుంటారు. వర్మ ఇంటర్వ్యూతో పాపులర్ అయిన ఆరియానా బిగ్‌బాస్ వరకూ వెళ్లింది. ఆ తర్వాత వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి మరోసారి ట్రెండింగ్‌లో నిలిచింది. తాజాగా వర్మ మరో ఆర్టిస్ట్ వైపు దృష్టి పెట్టారు. తాజాగా మరో బిగ్‌బాస్ బ్యూటీ ఆషురెడ్డి వర్మను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లింది. ఇక లేడీ యాంకర్‌లను చూస్తే వర్మ ప్రవర్తన తీరు, మాటలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే! ముందు పొగడ్తలతో ముంచి ఆ తర్వాత తన కెమెరా పనితనానికి పని చెబుతాడు. ఆషు విషయంలో కూడా అదే జరిగింది. ఆయన కెమెరాలోని లో యాంగిల్ ప్రతిభను బయటకు తీశాడు. ఆమె కుర్చీలో కూర్చొని ఉండగా.. వర్మ కింద కూర్చొని ఫోటో తీశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈసారి వర్మ ఇంటర్వ్యూ ఏ యాంగిల్‌లో ఉంటుంది అనేది ఇంకా తెలీదు. ఆరియానా లాగా జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఇంటర్వ్యూ ఇచ్చాడా.. లేదా మరేదన్నా కొత్తగా ప్లాన్ చేశాడా అన్నది ప్రోమో వస్తే గానీ తెలీదు.