అండర్ కవర్ పోలీస్‌గా?
ABN, First Publish Date - 2021-06-04T06:54:03+05:30
మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కలయికలో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు వచ్చాయి. పదకొండేళ్లకు మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ కుదిరింది. ముచ్చటగా మూడో చిత్రం రూపొందుతోంది...

మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కలయికలో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు వచ్చాయి. పదకొండేళ్లకు మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ కుదిరింది. ముచ్చటగా మూడో చిత్రం రూపొందుతోంది. మహేశ్‌బాబు ఈ చిత్రంలో అండర్ కవర్ పోలీస్‌గా కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. గతంలో గూఢచారిగా కనిపించనున్నారనీ వినిపించింది. మరి, హీరో పాత్ర ఏమిటన్నది త్రివిక్రమ్ లేదా చిత్రనిర్మాతలు చెబితే గానీ తెలియదు. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్‌లో దర్శకుడు బిజీగా ఉన్నారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి మమత సమర్పణలో సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అన్నట్టు... ‘పోకిరి’లో మహేశ్ అండర్ కవర్ పోలీస్‌గా నటించిన విషయం విధితమే. ‘దూకుడు’, ‘ఆగడు’ చిత్రాల్లోనూ ఆయన పోలీస్‌గా కనిపించారు.