రిటైర్డ్‌ రా అధికారిగా...

ABN , First Publish Date - 2021-02-24T10:10:13+05:30 IST

అక్కినేని నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హై వోల్టేజ్‌ యాక్షన్‌ డ్రామాగా...

రిటైర్డ్‌ రా అధికారిగా...

అక్కినేని నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హై వోల్టేజ్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇందులో నాగార్జున రిటైర్డ్‌ రా అధికారిగా నటిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా ‘చిత్రజ్యోతి’కి తెలిసింది. ప్రస్తుతం యాక్షన్‌ దృశ్యాలను తెరకెక్కిస్తున్నారు. అవన్నీ హాలీవుడ్‌ తరహాలో ఉండేలా దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసింది. ఆయన దర్శకత్వం వహించిన గత చిత్రం ‘పీఎస్వీ గరుడవేగ’లో డ్యామ్‌ దగ్గర హీరో యాక్షన్‌ సీన్‌తో పాటు రోడ్‌ ఛేజింగులను ప్రత్యేకంగా డిజైన్‌ చేయించారు. అదే విధంగా ఈ చిత్రానికి స్లిక్‌ యాక్షన్‌ సీన్స్‌ డిజైన్‌ చేయించారట. యాక్షన్‌తో పాటు భావోద్వేగభరితంగా నాగార్జున పాత్ర ఉంటుందట. ఈ నెలాఖరుకు హైదరాబాద్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుని, గోవాలో కొత్త షెడ్యూల్‌ ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని నారాయణ దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ నిర్మిస్తున్నారు.


Updated Date - 2021-02-24T10:10:13+05:30 IST