కిరాతకలో జంటగా...

ABN , First Publish Date - 2021-06-23T06:20:00+05:30 IST

ఆది సాయికుమార్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా నటించనున్నారు. ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌లో వీళ్లిద్దరూ కనువిందు చేయనున్నారు....

కిరాతకలో జంటగా...

ఆది సాయికుమార్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా నటించనున్నారు. ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌లో వీళ్లిద్దరూ కనువిందు చేయనున్నారు. ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా ఎం. వీరభద్రం దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసింది. విజన్‌ సినిమాస్‌ పతాకంపై డా. నాగం తిరుపతిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కిరాతక’ టైటిల్‌ ఖరారు చేశారు. నిర్మాత తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ‘‘వినూత్న కథతో రూపొందిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. ‘కిరాతక’ టైటిల్‌కి స్పందన బావుంది’’ అని వెల్లడించారు. దర్శకుడు వీరభద్రం మాట్లాడుతూ ‘‘ఆదితో ‘చుట్టాలబ్బాయి’ తర్వాత నేను చేస్తున్న చిత్రమిది. స్ర్కిప్ట్‌ వర్క్‌ పూర్తిచేశా. అద్భుతంగా వచ్చింది. నిర్మాణంలో రాజీపడకుండా మంచి బడ్జెట్‌తో తిరుపతిరెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేశ్‌ బొబ్బిలి సంగీతం, రామ్‌రెడ్డి విజువల్స్‌ మా చిత్రానికి బలం. ఇక, ఆదికి జోడీగా పాయల్‌ను ఎంపిక చేశాం. వీళ్లిద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి తిర్మల్‌రెడ్డి యాళ్ల ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత.

Updated Date - 2021-06-23T06:20:00+05:30 IST