సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం

ABN , First Publish Date - 2021-06-17T16:19:50+05:30 IST

దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం నెలకొంది.

సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం

హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ సినిమా ఇండస్ట్రీని కూడా పీడిస్తోంది. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుమారుడు సంజయ్‌ రూప్‌ కరోనాతో పోరుడుతూ తుది శ్వాస విడిచారు. మరో వైపు ఆమె భర్త సయితం కరోనాకు గురయ్యారు. ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన కవిత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె కుమారుడి మృతిపై ఆయా చిత్ర పరిశ్రమల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.


కవిత ఓ మజ్నూ అనే తమిళ సినిమాతో 11 ఏళ్లకే వెండితెర అరంగేట్రం చేశారు. సుమారు 50కిపైగా తమిళ చిత్రాల్లో తళుక్కున మెరిసిన ఆమె తెలుగు, మలయాళ, కన్నడ సినిమాల్లోనూ నటించారు. హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

Updated Date - 2021-06-17T16:19:50+05:30 IST