ఉత్కంఠకు గురి చేసే ‘అర్థం’

ABN , First Publish Date - 2021-10-18T23:48:56+05:30 IST

మహేంద్ర, శ్రద్థా దాస్‌, అజయ్‌, ఆమని, సాహితీ ఆవంచ ప్రధాన తారలుగా రూపొందుతున్న చిత్రం ‘అర్థం’. రిత్విక్‌ వెత్సా సమర్పణలో మినర్వా పిక్చర్స్‌, ఎస్‌విఎమ్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై రాధికా శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్‌ఎక్స్‌ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్‌ తెల్లగూటి ఈ చిత్రానికి దర్శకుడు.

ఉత్కంఠకు గురి చేసే ‘అర్థం’

మహేంద్ర, శ్రద్థా దాస్‌, అజయ్‌, ఆమని, సాహితీ ఆవంచ ప్రధాన తారలుగా రూపొందుతున్న చిత్రం ‘అర్థం’. రిత్విక్‌ వెత్సా సమర్పణలో మినర్వా పిక్చర్స్‌, ఎస్‌విఎమ్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై రాధికా శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్‌ఎక్స్‌ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్‌ తెల్లగూటి ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం  ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను దర్శకుడు దేవకట్టా విడుదల చేశారు. అనంతరం ఆయన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మోషన్‌ పోస్టర్‌ చివరలో గన్‌ పట్టుకుని కనిపించిన మహేంద్ర సినిమాపై క్యూరియాసిటి పెంచారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేేస కథాంశంతో రూపొందుతున్న సైకలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం. హర్షవర్థన్‌ రామేశ్వర్‌ చక్కటి బాణీలు అందించారు’’ అని అన్నారు. ‘‘కుటుంబ విలువలను కాపాడుతూ, మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న సినిమా ఇది’’ అని దర్శకుడు తెలిపారు. Updated Date - 2021-10-18T23:48:56+05:30 IST