కంగన-హృతిక్ బంధంపై అర్నాబ్ కామెంట్స్!
ABN , First Publish Date - 2021-01-18T21:47:32+05:30 IST
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణం కేసు ఊహించని మలుపు తిరిగింది.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణం కేసు ఊహించని మలుపు తిరిగింది. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి, బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తా మధ్య జరిగినట్టు చెబుతున్న వాట్సాప్ ఛాట్ సంచలనం రేపుతోంది. 500 పేజీలకు పైగా ఉన్న ఈ వాట్సాప్ మెసేజ్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ స్టార్స్ హృతిక్, కంగన గురించి కూడా అర్నాబ్, పార్థోదాస్ గుప్తా చర్చించుకున్నట్టు తెలుస్తోంది. `కంగనకు ఎరటొమేనియా ఉందని హృతిక్ చెప్పాడ`ని అర్నాబ్ ఓ సందేశంలో పేర్కొన్నారు. `ఎరటొమేనియా అంటే ఎమిట`ని పార్థోదాస్ అడగగా.. `ఆమె అతనితో లైంగిక సంబంధం కలిగి ఉంద`ని అర్నాబ్ రిప్లై ఇచ్చాడు. ఈ సందేశం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.