ఆసక్తి రేపుతోన్న ‘అర్జున ఫల్గుణ’ మేకింగ్ వీడియో

ABN , First Publish Date - 2021-12-29T21:57:49+05:30 IST

విలక్షణ హీరో శ్రీవిష్ణు, అందాల అమృత అయ్యర్ జంటగా.. కొత్త దర్శకుడు తేజ మార్ని తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ ‘అర్జున ఫల్గుణ’. తూర్పుగోదావరి బ్యాక్ డ్రాప్ లో గంజాయి స్మగ్లింగ్ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. నలుగురు స్నేహితులు తమకు తెలియకుండానే గంజాయి స్మగ్లింగ్ ఊబిలో కూరుకుపోతారు. చేయని నేరానికి శిక్ష అనుభవించడం ఇష్టం లేక.. తమ తెలివితేటలతో దాన్నుంచి ఎలా బైట పడ్డారు అన్నదే ఈ సినిమా కథాంశం. తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది.

ఆసక్తి రేపుతోన్న ‘అర్జున ఫల్గుణ’ మేకింగ్ వీడియో

విలక్షణ హీరో శ్రీవిష్ణు, అందాల అమృత అయ్యర్ జంటగా.. కొత్త దర్శకుడు తేజ మార్ని తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ ‘అర్జున ఫల్గుణ’. తూర్పుగోదావరి బ్యాక్ డ్రాప్ లో గంజాయి స్మగ్లింగ్ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. నలుగురు స్నేహితులు తమకు తెలియకుండానే గంజాయి స్మగ్లింగ్ ఊబిలో కూరుకుపోతారు. చేయని నేరానికి శిక్ష అనుభవించడం ఇష్టం లేక.. తమ తెలివితేటలతో దాన్నుంచి ఎలా బైట పడ్డారు అన్నదే ఈ సినిమా కథాంశం. తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. డిసెంబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.  రిలీజ్ దగ్గర పడడంతో మరింత ఆసక్తిని పెంచే ప్రయత్నంలో ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియో ను వదిలారు. 


ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ సినిమా తెరకెక్కిందని మేకింగ్ వీడియోను బట్టి అర్ధమవుతుంది. వివిధ లొకేషన్స్ ఆకట్టుకుంటున్నాయి.  శ్రీవిష్ణు స్నేహితులుగా జబర్దస్త్ మహేశ్, చైతన్య, రాజ్ కుమార్ కాశిరెడ్డి నటించగా.. శివాజీరాజా, నరేశ్, సుబ్బరాజు, దేవీప్రసాద్ , గౌరవ్ పరీక్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అన్వేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. 



Updated Date - 2021-12-29T21:57:49+05:30 IST