పెళ్లి బాజాలు మోగనున్నాయా?

ABN , First Publish Date - 2021-11-09T06:57:20+05:30 IST

బాలీవుడ్‌లో మరో ప్రేమ జంట పెళ్లి పీటలెక్కబోతోందా? అవుననే అంటున్నాయి బీ టౌన్‌ వర్గాలు. కొంతకాలంగా ప్రేమ పక్షులుగా విహరిస్తున్న కట్రీనా కైఫ్‌, విక్కీ కౌశల్‌ డిసెంబరులో పెళ్లి చేసుకోబోతున్నారని...

పెళ్లి బాజాలు మోగనున్నాయా?

బాలీవుడ్‌లో మరో ప్రేమ జంట పెళ్లి పీటలెక్కబోతోందా? అవుననే అంటున్నాయి బీ టౌన్‌ వర్గాలు. కొంతకాలంగా ప్రేమ పక్షులుగా విహరిస్తున్న కట్రీనా కైఫ్‌, విక్కీ కౌశల్‌ డిసెంబరులో పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకు ముహూర్తం కూడా కుదిరిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీపావళి రోజున కట్రీనా, విక్కీ కుటుంబ సభ్యులు ముంబైలో రోకా అనే వేడుక చేసుకున్నారు. పెళ్లికి ముందు జరిగే సంప్రదాయబద్ధమైన తంతు ఇది. దాంతో.. వీరిద్దరి పెళ్లిపై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. రాజస్థాన్‌లోని ఓ రిసార్ట్‌లో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్టు సమాచారం. అయితే... ఈ విషయమై కట్రీనా, విక్కీలు అధికారికంగా స్పందించాల్సివుంది.


Updated Date - 2021-11-09T06:57:20+05:30 IST