స్వాతంత్య్రం ఎవరి కోసమో?

ABN , First Publish Date - 2021-06-03T04:26:46+05:30 IST

కార్తీక్‌ రత్నం, కృష్ణప్రియ జంటగా... నవీన్‌ చంద్ర, సుహాస్‌, సాయికుమార్‌, శుభలేఖ సుధాకర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అర్ధ శతాబ్దాం’. ఈ నెల 11న ‘ఆహా’లో విడుదల కానుంది. బుధవారం ట్రైలర్‌ను నాని విడుదల చేశారు....

స్వాతంత్య్రం ఎవరి కోసమో?

కార్తీక్‌ రత్నం, కృష్ణప్రియ జంటగా... నవీన్‌ చంద్ర, సుహాస్‌, సాయికుమార్‌, శుభలేఖ సుధాకర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అర్ధ శతాబ్దాం’. ఈ నెల 11న ‘ఆహా’లో విడుదల కానుంది. బుధవారం ట్రైలర్‌ను నాని విడుదల చేశారు. ‘ఈ విశాల సృష్టిలో మనిషి కన్నా ముందు ఎన్నో జీవరాసులు పుట్టాయి. ఒకానొక రాక్షస ఘడియలో మానవజాతి పుట్టుక సంభవించింది’ అని శుభలేఖ సుధాకర్‌ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌, ఆయన డైలాగ్‌ ‘యాభై ఏళ్ల స్వాతంత్య్రం దేని కోసమో, ఎవరి కోసమో ఇప్పటిదాక ఎవరికీ అర్థం కాలేదు’తో ముగిసింది. ‘‘తెలంగాణలోని కుగ్రామ మూలాల్లోని రాజకీయ, కుల వ్యవస్థకు యాక్షన్‌, రొమాన్స్‌ మేళవించి రూపొందించిన చిత్రమిది’’ అని దర్శకుడు రవీంద్ర పుల్లే, నిర్మాతలు చిట్టి కిరణ్‌ రామోజు, తేలు రాధాకృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి నోఫెల్‌ రాజు సంగీత దర్శకుడు.

Updated Date - 2021-06-03T04:26:46+05:30 IST