ఓటీటీలో 'అర్థ శతాబ్దం'
ABN, First Publish Date - 2021-03-16T18:32:52+05:30
జాతీ, మత, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా, ప్రేమ కోసం జరిగే పోరాటంగా రాజకీయాలు, కులాల మధ్య జరిగిన వివాదాల నేపథ్యంలో 2003 లో జరిగిన కథే 'అర్ధ శతాబ్దం'.
జాతీ, మత, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా, ప్రేమ కోసం జరిగే పోరాటంగా రాజకీయాలు, కులాల మధ్య జరిగిన వివాదాల నేపథ్యంలో 2003 లో జరిగిన కథే 'అర్ధ శతాబ్దం'. రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయి కుమార్, కృష్ణ ప్రియ, సుహాస్, పవిత్ర లోకేష్ తదితరులు నటిస్తున్నారు. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 26 నుంచి 'ఆహా'లో విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రవీంద్ర పుల్లే మాట్లాడుతూ "ఈ 'అర్ధశతాబ్దం' సినిమా 1950 నుండి 2003 వరకు జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని ఎలా వాడుకుంటున్నాం. ఎలా మిస్ యూజ్ చేసుకుంటున్నామనే కథాంశంతో అద్భుతమైన లవ్ స్టొరీని జోడించి సినిమాను తెరకెక్కించాం. ఆహా వారికి మా మా టీజర్ నచ్చడంతో ఈ సినిమాను ఆహాలో విడుదల చేయమని ఆఫర్ రావడంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మా 'అర్ధశతాబ్దం' సినిమాను మార్చి 26 విడుదల చేస్తున్నాం" అన్నారు.
నిర్మాత చిట్టి కిరణ్ మాట్లాడుతూ.. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో ఈ నెల 26వ తేదీన వస్తున్న మా "అర్ధ శతాబ్దం" చిత్రాన్ని ఆదరించి మాకు సపోర్ట్ నిలిస్తే మరిన్ని చిత్రాలు నిర్మిస్తామని అన్నారు. నిర్మాత రాధాకృష్ణ మాట్లాడుతూ... ఆర్టిస్ట్ అయిన నేను ఈ కథ నచ్చడంతో నిర్మాతగా మారాను. పాండమిక్ సమయంలో ఆహా నుండి వచ్చిన ఆఫర్‌ను మిస్ చేసుకోకుండా ప్రస్తుతం జనాల్లోకి వెళ్లేలా ఆహా లో విడుదల చేస్తే మరిన్ని చిత్రాలు నిర్మించవచ్చని ఈ నెల 26 న ఆహాలో విడుదల చేస్తున్నాం" అన్నారు.