‘ఏప్రిల్ 28 ఏం జరిగింది‌’.. తెలిసేది ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2021-02-02T00:47:06+05:30 IST

రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వీరాస్వామి.జి. స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఏప్రిల్ 28న ఏం జరిగింది‌’. ఇటీవల ఈ చిత్ర

‘ఏప్రిల్ 28 ఏం జరిగింది‌’.. తెలిసేది ఎప్పుడంటే?

రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వీరాస్వామి.జి. స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది‌’. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్రయూనిట్‌ కొన్ని పోస్టర్స్‌ను రిలీజ్‌ చేసింది. మార్చి 5న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. 


ఈ సందర్భంగా వీరాస్వామి. జి మాట్లాడుతూ.. ఇటీవల విడుదల చేసిన మా ట్రైలర్ అందరిలోనూ ఆసక్తిని కలిగించింది. ట్రైలర్‌కు వచ్చిన స్పందనతో చిత్ర విజయంపై మాకు మరింత విశ్వాసం కలిగింది. తప్పకుండా ఓ కొత్త తరహా చిత్రాన్ని చూసిన అనుభూతిని ప్రేక్షకులు పొందుతారనే నమ్మకం ఉంది. నేటి తరం ప్రేక్షకులు మెచ్చే ఓ వినూత్నమైన కథతో ఎవరూ అంచనా వేయలేని ట్విస్ట్‌లతో, ప్రతి మలుపు ఆసక్తికరంగా థ్రిల్లింగ్‌గా వుంటుంది. థ్రిల్లర్ జోనర్‌లో ఇటువంటి కాన్సెప్ట్‌తో ఇప్పటి వరకు చిత్రం రాలేదు. తప్పకుండా చిత్రం అందరి ప్రశంసలు అందుకుంటుంది. మార్చి 5న చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి హరిప్రసాద్ జక్కా స్క్రీన్‌ప్లే అందించారు. 



Updated Date - 2021-02-02T00:47:06+05:30 IST