విలన్‌గా చేయడానికీ సిద్ధమే! డా. రంజిత్
ABN , First Publish Date - 2021-02-27T04:40:36+05:30 IST
ఈ నెల 27న నా తొలి చిత్రం ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది?’ విడుదల కానుంది. మా నాన్న ఏల్చూరి వెంకట్రావుగారు బాటలో నడుస్తూ నేను ఆయుర్వేదంలో ఎండీ చేశా. పన్నెండేళ్లుగా వైద్యుడిగా సేవలు అందిస్తున్నా. నటనపై ఆసక్తితో....

ఈ నెల 27న నా తొలి చిత్రం ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది?’ విడుదల కానుంది. మా నాన్న ఏల్చూరి వెంకట్రావుగారు బాటలో నడుస్తూ నేను ఆయుర్వేదంలో ఎండీ చేశా. పన్నెండేళ్లుగా వైద్యుడిగా సేవలు అందిస్తున్నా. నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చా. హీరోగా మాత్రమే నటించాలని పరిమితులు పెట్టుకోలేదు. నటనకు ఆస్కారమున్న పాత్రలతోపాటు విలన్‌గా చేయడానికీ సిద్ధమే’’ అని హీరో రంజిత్ అన్నారు. ఓ మంచి కథ రాయడం కోసం కుటుంబంతో కలిసి హీరో ఓ ఇంటికి వెళతాడు. అక్కడ ఏం జరిగిందనేది కథ. ఇదొక సస్సెన్స్ థ్రిల్లర్. ఈ చిత్రానికి: దర్శకుడు వీరాస్వామి, నిర్మాణం: వి.జి. ఎంటర్‌టైన్‌మెంట్స్