‘ఏపీ04 రామాపురం’ మోషన్ పోస్టర్ విడుదల
ABN , First Publish Date - 2021-02-02T23:17:36+05:30 IST
ఆర్‌ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్ వి శివ రెడ్డి సమర్పణలో రామ్ జాక్కల, అఖిల ఆకర్షణ, పి.యన్ రాజ్, సునీల్ మల్లెం నటీనటులుగా

ఆర్‌ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్ వి శివ రెడ్డి సమర్పణలో రామ్ జాక్కల, అఖిల ఆకర్షణ, పి.యన్ రాజ్, సునీల్ మల్లెం నటీనటులుగా హేమ రెడ్డి దర్శత్వంలో రామ్ రెడ్డి అందూరి నిర్మించిన చిత్రం ‘ఏపీ04 రామాపురం’. ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. హీరో కిరణ్ అబ్బవరం (ఎస్ఆర్ కళ్యాణ మండపం హీరో) సినిమా టైటిల్‌ను ఆవిష్కరించగా.. కడప నగర మాజీ మేయర్, వైసీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షుడు సురేష్ బాబు టైటిల్ వీడియోను, ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా సినిమా మోషన్ పోస్టర్‌ను కడపలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. హాజరైన ప్రముఖులందరూ ఈ చిత్రం మంచి విజయం సాధించి, అందరికీ మంచి పేరు, నిర్మాతకు డబ్బులు తీసుకురావాలని కోరారు.