సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కష్టకాలాన్ని మనం అధిగమిస్తాం: అనుష్కాశెట్టి

ABN, First Publish Date - 2021-05-04T23:35:51+05:30

టాలీవుడ్‌ దేవసేన అనుష్క శెట్టి కరోనా సెకెండ్‌ వేవ్‌ కోరలు చాస్తున్న సమయంలో ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ ఓ సందేశం ఇచ్చారు. ఈ మేరకు తన నూతన ట్విట్టర్‌ అకౌంట్‌లో ఓ లెటర్‌ పోస్ట్‌ చేశారు. ‘‘ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బాగున్నారని అనుకుంటున్నాను. పోయిన వారిని తిరిగి తీసుకురాలేము.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‌ దేవసేన అనుష్క శెట్టి కరోనా సెకెండ్‌ వేవ్‌ కోరలు చాస్తున్న సమయంలో ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ ఓ సందేశం ఇచ్చారు. ఈ మేరకు తన నూతన ట్విట్టర్‌ అకౌంట్‌లో ఓ లెటర్‌ పోస్ట్‌ చేశారు. ‘‘ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బాగున్నారని అనుకుంటున్నాను. పోయిన వారిని తిరిగి తీసుకురాలేము. అయితే కరోనాకు మహమ్మారికి మరొకరు బలి కాకుండా జాగ్రత్త పడడం మన చేతుల్లోనే ఉంది. దీని కోసం ఒకరికొకరం సాయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. దీని నుంచి బయట పడాలంటే అందరూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, వీలైనంత వరకు ఇంట్లోనే ఉండేందుకే ప్రయత్నించండి. ‘మీకు మీరే స్వీయ నిర్బంధం  విధించుకోండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడుతూ సమయాన్ని గడపండి. ప్రతీ ఒక్కరికీ వారి బాధలను ఎలా వ్యక్త పరచాలో తెలియకపోవచ్చు. ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయండి. ఇలాంటి సమయంలో మనకు పాజిటివ్‌ ఎనర్జీ అవసరం. కష్టంలో ఉన్నవారిని ఆదుకోండి. వారి గురించి ప్రార్థనలు చేయండి. ఈ కష్టకాలాన్ని మనం అధిగమిస్తాం. మానవ శక్తిని మనమంతా కలిసి బయటకు తీసుకురావచ్చు’’ అంటూ స్వీటీ పేర్కొన్నారు. 




Updated Date - 2021-05-04T23:35:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!