ఓటీటీలోనే మరో సినిమా..

ABN , First Publish Date - 2021-11-28T18:40:06+05:30 IST

టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శాకిని డాకిని’. ఈ చిత్రంలో నివేతా థామస్‌, రెజీనా కసాండ్ర టైటిల్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇటీవల వెంకటేశ్ హీరోగా నటించిన ‘నారప్ప’, ‘దృశ్యం 2’ చిత్రాలు ఓటీటీలోనే విడుదలై

ఓటీటీలోనే మరో సినిమా..

టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శాకిని డాకిని’. ఈ చిత్రంలో నివేతా థామస్‌, రెజీనా కసాండ్ర టైటిల్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇటీవల వెంకటేశ్ హీరోగా నటించిన ‘నారప్ప’, ‘దృశ్యం 2’ చిత్రాలు ఓటీటీలోనే విడుదలై హిట్ సాధించాయి. ఈ క్రమంలో ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ‘శాకిని డాకిని’ కూడా ఓటీటీలోనే రిలీజ్ కానున్నట్టు మేకర్స్ తెలిపారు. ‘ఓ బేబీ’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో రూపొందుతున్న రెండవ సినిమా ‘శాకిని డాకిని’. డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘శాకిని డాకిని’ సినిమాను ఓటీటీలోనే విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాతల్లో ఒకరైన సురేశ్ బాబు తెలిపారు. 

Updated Date - 2021-11-28T18:40:06+05:30 IST