ఫిబ్రవరి 26న `అంగుళీక‌`

ABN , First Publish Date - 2021-02-02T21:54:24+05:30 IST

శ్రీ శంకు చక్ర ఫిలిమ్స్ పతాకంపై వివ్యశాంత్, శేఖర్ వర్మ హీరో హీరోయిన్లుగా.. దేవ్ గిల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `అంగుళీక‌`. ఈ సినిమా ఈ నెల 26న విడుద‌ల‌వుతుంది.

ఫిబ్రవరి 26న `అంగుళీక‌`

 శ్రీ శంకు చక్ర ఫిలిమ్స్ పతాకంపై వివ్యశాంత్, శేఖర్ వర్మ హీరో హీరోయిన్లుగా.. దేవ్ గిల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `అంగుళీక‌`.  ప్రేమ్ ఆర్యన్‌ను దర్శకుడిగా ప‌రిచయం అవుతున్నారు. మాస్టర్ టి హర్షిత్ సాయి సమర్పణలో కోటి తూముల, ఎ.జగన్మోహన్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.  అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 26న విడుద‌ల‌వుతుంది.


ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత కోటి తూముల మాట్లాడుతూ   ``గతేడాది అన్ని హంగులు పూర్తి చేసుకుని అంగుళీక సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. అయితే కోవిడ్ ప్ర‌భావంతో సినిమా విడుద‌ల‌ను వాయిదా వేశాం. ప్ర‌స్తుతం థియేట‌ర్స్‌ను వంద‌శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్ చేసుకోవ‌చ్చున‌ని తెలియ‌జేసిన నేప‌థ్యంలో అంగుళీక చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 26న విడుద‌ల చేస్తున్నాం. గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కిన  మా చిత్రంలో కమర్షియల్ గా అన్ని హంగులు ఉంటాయి`` అన్నారు. ద‌ర్శ‌కుడు ప్రేమ్ ఆర్య‌న్ మాట్లాడుతూ ``ఈచిత్రం సూర్యభగవానుని అంశతో జన్మించిన అమ్మాయికి.. కాల చక్రాన్ని దూషిస్తూ ఎదురు తిరిగిన దుష్ట శక్తికి మధ్య జరిగిన పోరాటమే  మా చిత్ర కథాంశం`` అనితెలిపారు.

Updated Date - 2021-02-02T21:54:24+05:30 IST