అరెస్ట్‌పై యాంకర్ శ్యామల భర్త క్లారిటీ
ABN, First Publish Date - 2021-04-30T16:54:15+05:30
బెయిల్‌పై బయటకు వచ్చిన నరసింహా రెడ్డి, తన అరెస్ట్‌కు సంబంధించి క్లారిటీ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు. శ్యామల ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఇటీవల ప్రముఖ యాంకర్ శ్యామల భర్త, బుల్లితెర నటుడు లక్ష్మీ నరసింహా రెడ్డిని రాయదుర్గం పోలీసులు చీటింగ్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన వద్ద కోటి రూపాయలు అప్పుగా తీసుకుని ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ నరసింహా రెడ్డిపై ఖాజా గూడకు చెందిన సింధూరా రెడ్డి అనే మహిళ చేసిన ఫిర్యాదుతో ఆయన్ను అరెస్ట్ చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన నరసింహా రెడ్డి, తన అరెస్ట్‌కు సంబంధించి క్లారిటీ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు. శ్యామల ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "నాపై ఇటీవల సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. అయితే నాపై వచ్చిన మోసపూరిత ఆరోపణలను నమ్మకుండా నాకు అండగా నిలిచిన వారందరికీ థాంక్స్. అయితే నా కేసుకు సంబంధించిన వివరాలు, వాటిని ఎలా తప్పుదోవ పట్టించారు అనే వివరాలతో, తగిన ఆధారాలతో మీ ముందుకు వస్తాను. నేను రెండు రోజుల్లోనే బయటకు రావడం అనేది ఇదొక తప్పుడు కేసు అనడానికి నిరూపణ. కొన్నిసార్లు నిందలను భరించాలి. అయితే పుకార్లకు స్పందించాల్సిన అవసరం కూడా ఉంది" అని వీడియోలో లక్ష్మీ నరసింహారెడ్డి తెలిపారు.