వెరైటీ డ్రెస్‌లో 'లైగర్' బ్యూటీ..ఇది డ్రస్సేనా అంటూ కామెంట్స్..!

ABN , First Publish Date - 2021-12-14T18:19:28+05:30 IST

'లైగర్' బ్యూటీ అనన్య పాండే లేటెస్ట్ పిక్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతూ వరల్ అవుతోంది. ఈ యంగ్ బ్యూటీ ఫొటోషూట్ కోసం వేసుకున్న ఓ అల్ట్రా మోడ్రన్ డ్రెస్ చూసి నెటిజన్స్ ఇది అసలు డ్రస్సేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారట.

వెరైటీ డ్రెస్‌లో 'లైగర్' బ్యూటీ..ఇది డ్రస్సేనా అంటూ కామెంట్స్..!

'లైగర్' బ్యూటీ అనన్య పాండే లేటెస్ట్ పిక్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతూ వరల్ అవుతోంది. ఈ యంగ్ బ్యూటీ ఫొటోషూట్ కోసం వేసుకున్న ఓ అల్ట్రా మోడ్రన్ డ్రెస్ చూసి నెటిజన్స్ ఇది అసలు డ్రస్సేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారట. బాలీవుడ్ పాపులర్ నటుడు చుంకీ పాండే గారాలపట్టి అయిన అనన్య పాండేకు హిందీ ఇండస్ట్రీలో మంచి క్రేజే ఉంది. ఇప్పుడీ భామ పూరి జగన్నాథ్ పుణ్యమా అంటూ మన టాలీవుడ్‌లో 'లైగర్' సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకుడు - విజయ్ దేవరకొండ హీరో - పాన్ ఇండియన్ సినిమా.. అంటే ఇక అనన్య పాండే క్రేజ్ ఎలా మారుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడెప్పుడు టాలీవుడ్‌లో ఈ సినిమాతో తెలుగుప్రేక్షకులను పలకరిద్దామా.. అని ఈ యంగ్ బ్యూటీ అనుకుంటుంటే, అంతే ఆతృతగా అనన్యను చూడాలని తెలుగు ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే, సినిమా కంటే ముందుగానే తన లేటెస్ట్ ఫొటోషూట్స్‌తో మంచి గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త పిక్స్‌తో అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తోంది. తాజాగా ఇలాంటి ఓ అల్ట్రా మోడ్రన్ డ్రస్‌లో అనన్య సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ పిక్‌లో అనన్య కాస్ట్యూం చాలా వెరైటీగా ఉంది. నెట్టెడ్ డ్రెస్‌లో ఈ యంగ్ బ్యూటీ పొడుగుకాళ్ళు బాగా హైలెట్ అవుతున్నాయి. ఇక ఈ వెరైటీ డ్రెస్‌లో అనన్యను చూసిన నెటిజన్స్ రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.  

Updated Date - 2021-12-14T18:19:28+05:30 IST