సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అమెరికాలో అదరగొట్టేస్తారు

ABN, First Publish Date - 2021-12-07T05:45:54+05:30

రాజమౌళి సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’పై కూడా ఆ భారం భారీగానే ఉంది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న చిత్రమిది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమౌళి సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’పై కూడా ఆ భారం భారీగానే ఉంది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న చిత్రమిది. జనవరి 7న వస్తోంది. సంక్రాంతి సీజన్‌కు ఘనమైన ఆరంభాన్ని ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ ఇవ్వబోతోందని చిత్రసీమ గట్టిగా నమ్ముతోంది. ఈనెల 9న ట్రైలర్‌ రాబోతోంది. ఈ ట్రైలర్‌ని రెండు తెలుగు రాష్ర్టాలలో ఉన్న ప్రధానమైన థియేటర్లలో ప్రదర్శించబోతోంది చిత్రబృందం. విడుదల కూడా కనీ వినీ ఎరుగని రీతిలో ప్లాన్‌ చేస్తున్నారు. ఒక్క అమెరికాలోనే వెయ్యికి పైగా మల్టీప్లెక్సులు బ్లాక్‌ చేశారని తెలుస్తోంది. అమెరికాలో ఓ భారతీయ సినిమా ఈస్థాయిలో ఎప్పుడూ విడుదల కాలేదని, ఆరకంగా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ రికార్డు సృష్టించబోతోందని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. 


Updated Date - 2021-12-07T05:45:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!