అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించిన సోనూసూద్
ABN , First Publish Date - 2021-01-19T17:51:04+05:30 IST
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ శివ అనే వ్యక్తి సోనూ సూద్ అంబులెన్స్ సర్వీస్ పేరుతో అంబులెన్స్ సేవలను ప్రారంభించాడు.

కోవిడ్ ప్రభావ సమయంలో బస్సులు, ట్రైన్స్, విమానాలతో వలస కార్మికులను వారి గమ్య స్థానాలు చేర్చడంతో పాటు ఎందరో ఆపన్నులకు అండగా నిలబడి రియల్ హీరోగా మారిన వ్యక్తి సోనూసూద్. ఇప్పుడు సోనూసూద్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోనూసూద్ చేస్తున్న సేవలను చూసి ఆయనకు అభిమానులుగా మారిన వారెందరో ఉన్నారు. అందులో కొందరు తమ అభిమానాన్ని చాటుకుంటూ తమ షాపులకు సోనూసూద్ పేరు పెట్టుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రానికి చెంది ఓ వ్యక్తి సోనూసూద్ కోసం గుడి కూడా కట్టేశాడు . తాజాగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ శివ అనే వ్యక్తి సోనూ సూద్ అంబులెన్స్ సర్వీస్ పేరుతో అంబులెన్స్ సేవలను ప్రారంభించాడు. తెలుగు రాష్ట్రాల్లో వైద్య సదుపాయం అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలకు ఈ అంబులెన్స్ సర్వీసుతో ప్రజలకు సేవలు అందిస్తారు. సోనూసూద్ ఈ సర్వీస్‌ను మంగళవారం లాంచ్ చేశాడు.