బంజారా భాషతో పాటు...
ABN , First Publish Date - 2021-10-06T06:38:01+05:30 IST
‘‘ఆడియో వేడుకలా కాదు... ఇది శతదినోత్సవంలా ఉంది. ఈ సినిమా కచ్చితంగా వందరోజులు ఆడాలి. దానికి నన్ను ముఖ్య అతిథిలా పిలవాలి’’ అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు...
‘‘ఆడియో వేడుకలా కాదు... ఇది శతదినోత్సవంలా ఉంది. ఈ సినిమా కచ్చితంగా వందరోజులు ఆడాలి. దానికి నన్ను ముఖ్య అతిథిలా పిలవాలి’’ అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. సుమన్ టైటిల్ పాత్రలో ఇస్లావత్ వినోద్ రైనా, సీతారామ్ నాయక్ నిర్మించిన చిత్రం ‘సేవాదాస్’. కేపీఎస్ చౌహన్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. ప్రీతి అస్రాని హీరోయిన్. భానుచందర్ కీలక పాత్రధారి. బంజారా, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో తెరకెక్కించారు. ‘‘ఈ నెల 15న ఇల్లెందులో ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహించి, నెలాఖరున సినిమా విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. తెలంగాణ గిరిజన, మహిళా సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్‌తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సివిల్ సర్వీసుల్లో ఉన్న అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.