'పుష్ప' షూటింగ్‌లో అభిమానులకు బన్నీ పలకరింపు

ABN , First Publish Date - 2021-02-02T16:06:05+05:30 IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ మూవీ 'పుష్ప‌'. ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం రాజమండ్రిలోని మారేడుమిల్లి అట‌వీ ప్రాంతంలో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

'పుష్ప' షూటింగ్‌లో అభిమానులకు బన్నీ పలకరింపు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ మూవీ 'పుష్ప‌'. ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం రాజమండ్రిలోని మారేడుమిల్లి అట‌వీ ప్రాంతంలో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా చిత్ర యూనిట్ ఖ‌మ్మంలోని మోతు గూడెంకు వెళ్లింది. విష‌యం తెలుసుకున్న ఫ్యాన్స్ భారీ సంఖ్యంలో అల్లు అర్జున్‌ను చూసేందుకు వ‌చ్చారు. విష‌యం తెలుసుకున్న స్టైలిష్‌స్టార్ కార్వాన్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి అభిమానుల‌ను ప‌ల‌క‌రించారు. శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర చందనం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న 'పుష్ప' సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 13న ప్యాన్‌ ఇండియా లెవల్లో గ్రాండ్ రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. Updated Date - 2021-02-02T16:06:05+05:30 IST