సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘పుష్ప’ ఐటం సాంగ్ ఉంటది నాయనా..!!: అల్లు అర్జున్

ABN, First Publish Date - 2021-12-13T23:27:52+05:30

నేను సమంతగారికి థ్యాంక్యూ చెప్పాలి. ఎందుకంటే.. ప్రత్యేక గీతాలు చేసేటప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నేను ఇలా చేస్తాను.. అలా చేయను.. అని అంటుంటారు. కానీ సమంత మాత్రం ఏది అడిగితే అది చేశారు. పాటకు పూర్తిగా న్యాయం చేశారు. సభాముఖంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా హీరోయిన్ సమంతకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమంత ఈ చిత్రంలో ‘ఊ అంటావా మావ..’ అనే ప్రత్యేక గీతంలో నటించిన విషయం తెలిసిందే. 


ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.. ‘‘నేను సమంతగారికి థ్యాంక్యూ చెప్పాలి. ఎందుకంటే.. ప్రత్యేక గీతాలు చేసేటప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నేను ఇలా చేస్తాను.. అలా చేయను.. అని అంటుంటారు. కానీ సమంత మాత్రం ఏది అడిగితే అది చేశారు. పాటకు పూర్తిగా న్యాయం చేశారు. సభాముఖంగా సమంతకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్యూ సమంత. ఇక సినిమాలో ఈ సాంగ్ ఉంటది నాయనా.. మాములుగా ఉండదు. మీరు చూడాలంతే. ఈ సాంగ్ మాత్రం తగ్గేదే లే.. అన్నట్లుగా ఉంటుంది..’’ అని తెలిపారు.  

Updated Date - 2021-12-13T23:27:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!