సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నా పైత్యం కోసం ఆ పని చేయదలుచుకోలేదు: అల్లు అర్జున్

ABN, First Publish Date - 2021-12-15T04:29:01+05:30

పాన్ ఇండియా సినిమా తీయాలన్న ఉద్దేశ్యంతో పుష్ప తీయలేదు. పుష్పలో పాన్ ఇండియా స్థాయిలో వెళ్లగలిగే విషయాలున్నాయి కాబట్టే.. అది పాన్ ఇండియా సినిమా అయింది. ఇదే కాదు. బాహుబలి కానీ, కేజీయఫ్‌గానీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘పుష్ప’ సినిమాకు సంబంధించి తెలుగు వరకే నేను డబ్బింగ్ చెప్పాను.. మిగతా భాషల్లో వేరేవారు చెప్పారు అని అన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన హీరోగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరో అల్లు అర్జున్ మీడియాతో ముచ్చటించారు. 


ఆయన మాట్లాడుతూ.. ‘‘పుష్ప పాన్ ఇండియా సినిమా అయినా సరే.. నేను తెలుగులో మాత్రమే డబ్బింగ్‌ చెప్పా. మిగిలిన భాషల్లో నా గొంతు వినిపించదు. నాకు తమిళం వచ్చు. బాగా మాట్లాడతా. కానీ డబ్బింగ్‌ చెప్పుకునేంత స్థాయిలో మాత్రం కాదు. నా పైత్యం కోసం.. నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకుంటే, అది కాస్త సింక్‌ అవ్వకపోతే... ఆ ప్రభావం సినిమాపై పడుతుంది. అది నాకు ఇష్టం లేదు. పాన్ ఇండియా సినిమా తీయాలన్న ఉద్దేశ్యంతో పుష్ప తీయలేదు. పుష్పలో పాన్ ఇండియా స్థాయిలో వెళ్లగలిగే విషయాలున్నాయి కాబట్టే.. అది పాన్ ఇండియా సినిమా అయింది. ఇదే కాదు. బాహుబలి కానీ, కేజీయఫ్‌గానీ ప్యూర్‌ సౌత్ సినిమా అనే కాన్సెప్ట్‌తో మొదలైన ప్రాజెక్టులే. కానీ అది కాల క్రమంలో పాన్ ఇండియా కథలైపోయాయి’’.. అని అన్నారు.

Updated Date - 2021-12-15T04:29:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!