రోడ్డు పక్కన బన్ని టిఫిన్‌.. వీడియో వైరల్‌

ABN , First Publish Date - 2021-09-13T21:39:38+05:30 IST

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం కాకినాడలో పుష్ప షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అక్కడ అటవీ ప్రాంతంలో కొన్ని యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీంతో కలిసి తూర్పు గోదావరి జిల్లా గోకవరం మీదుగా ప్రయాణిస్తున్న ఆయన ఓ చిన్న హోటల్‌ వద్ద ఆగి టిఫిన్‌ చేశారు.

రోడ్డు పక్కన బన్ని టిఫిన్‌.. వీడియో వైరల్‌

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం కాకినాడలో పుష్ప షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అక్కడ అటవీ ప్రాంతంలో కొన్ని యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీంతో కలిసి తూర్పు గోదావరి జిల్లా గోకవరం మీదుగా ప్రయాణిస్తున్న ఆయన ఓ చిన్న హోటల్‌ వద్ద ఆగి టిఫిన్‌ చేశారు. సాదాసీదాగా షార్ట్‌తో బయటకొచ్చి సాధారణ హోటల్‌లో టిఫిన్‌ చేసి బిల్లు కడుతున్న సన్నివేశాన్ని అభిమానులు తమ ఫోన్‌లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 




Updated Date - 2021-09-13T21:39:38+05:30 IST