తేజ్‌ ప్రమాదం.. మొదట బన్నీకే తెలిసిందట.

ABN , First Publish Date - 2021-09-13T00:18:55+05:30 IST

రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయితేజ్‌ మూడు రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాలర్‌ బోన్‌ సర్జరీ విజయవంతంగా పూర్తయిందని వెల్లడించారు.

తేజ్‌ ప్రమాదం.. మొదట బన్నీకే తెలిసిందట.


రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయితేజ్‌ మూడు రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాలర్‌ బోన్‌ సర్జరీ విజయవంతంగా పూర్తయిందని వెల్లడించారు. సాయి తేజ్‌ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటుంటే.. కొందరు మాత్రం ట్రోల్‌ చేస్తున్నారు. కుటుంబ సభ్యులైన బన్నీ, తేజ్‌ ఆరోగ్యం గురించి ట్వీట్‌ చేయలేదని, కనీసం ఆయన ఎలా ఉన్నారో తెలుసుకోలేదని ట్రోల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తేజ్‌ ప్రమాదానికి గురైన సంగతి తొలుత బన్నీకే తెలుసని, మెడికోవర్‌ ఆస్పత్రిలో పని చేసే బన్నీ స్నేహితులు ఆ విషయాన్ని హుటాహుటిన బన్నీకి తెలియజేశారని, ఆయనే స్వయంగా చిరంజీవి భార్య సురేఖకు ప్రమాదం విషయం తెలియజేశారని పుష్ప టీమ్‌ నుంచి సమాచారం. కాకినాడలో ుపుష్ప చిత్రీకరణతో బిజీగా ఉన్న అల్లు అర్జున్‌ ఎప్పటికప్పుడు ఫోన్‌ టచ్‌లో ఉన్నారని తెలిపారు.  తేజ్‌ క్షేమ సమాచారం తెలుసుకునే క్రమంలో ఈ రోజు షూటింగ్‌కు బన్నీ ఆలస్యంగా వెళ్లారని తెలిసింది. మరో పక్క ట్రోలర్ప్‌ మీద అల్లు అర్జున్‌ మండిపడ్డారని తెలిసింది. ుప్రమాదం జరిగి కుటుంబ సభ్యులంతా ఆందోళనలో ఉంటే.. 'మా కుటుంబం గురించి మేమే ట్వీట్లు చేసుకోవడం ఏంటని’ బన్నీ మండిపడ్డారని పుష్ప డైరెక్షన్‌ టీమ్‌ నుంచి సమాచారం. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లుఅర్జున్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న 'పుష్ప' చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం కాకినాడలో జరుగుతోంది. ఇక ప్రమాదం విషయం తెలుసుకున్న పవన్‌కల్యాణ్‌ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని, దాదాపు ఆరున్నర గంటలపాటు ఆస్పత్రిలోనే ఉన్న సంగతి తెలిసిందే! 

Updated Date - 2021-09-13T00:18:55+05:30 IST