అల్లు అర్జున్‌: నువ్వు లేకపోతే ‘ఆర్య లేదు.. ఇంకేమీ లేదు’!

ABN , First Publish Date - 2021-12-29T00:01:10+05:30 IST

సుకుమార్‌ ‘ఆర్య’ లేకపోతే తాను లేనంటూ వేదికపై భావోద్వేగానికి గురయ్యారు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌. తన్నుకొస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ మాట్లాడుతుంటే అక్కడే ఉన్న దర్శకుడు సుకుమార్‌ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇటీవల విడుదలైన ‘పుష్ప’ చిత్రం రికార్డ్‌ స్థాయి వసూళ్లతో దూసుకెళ్తుంది.

అల్లు అర్జున్‌: నువ్వు లేకపోతే ‘ఆర్య లేదు.. ఇంకేమీ లేదు’!

సుకుమార్‌ ‘ఆర్య’ లేకపోతే తాను లేనంటూ వేదికపై భావోద్వేగానికి గురయ్యారు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌. తన్నుకొస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ మాట్లాడుతుంటే అక్కడే ఉన్న దర్శకుడు సుకుమార్‌ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇటీవల విడుదలైన ‘పుష్ప’ చిత్రం రికార్డ్‌ స్థాయి వసూళ్లతో దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన థ్యాంక్స్‌ మీట్‌లో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ‘‘సుకుమార్‌ గురించి నేను, నా గురించి ఆయన ఎక్కువ చెప్పుకోలేం. వ్యక్తిగత విషయాలను బయట పంచుకోలేం. సుకుమార్‌ నాకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి. ఆయనెంటో ప్రపంచానికి తెలియాలి. సుకుమార్‌ ఉంటే నా లైఫ్‌ ఒకలా ఉంది. లేకపోతే ఇంకోలా ఉండేది. ప్రతి మనిషికీ 18–19ఏళ్ల వయసులో జీవితంలో ఏం అవ్వాలన్న సందిగ్థత ఉంటుంది. నేను సినిమాలు చేద్దాం అనుకున్నప్పుడు సుకుమార్‌తో ‘ఆర్య’ చేయడం వల్ల లైఫ్‌ ఇలా ఉంది. ఐకాన్‌స్టార్‌గా ఎదిగాను అంటే కారణం సుకుమార్‌గారు. ఆరోజుకు అది వన్‌ డిగ్రీ కాన్సెప్ట్‌. ఇది ఎలా పనిచేస్తుందంటే షిప్‌ వెళ్లేటప్పుడు ఒక డిగ్రీ పక్కకు జరిగితే వెళ్లాల్సిన చోటుకు కాకుండా పక్క ఖండానికి వెళ్లిపోతుంది. నా జీవితానికి సుకుమార్‌ ఆ చిన్న డిగ్రీ. నా జీవితంలో ‘నేను మీకు రుణపడి ఉన్నా’అనే మాట అతి తక్కువ మందికి వాడగలను. నా తల్లిదండ్రులు, రైతు కుటుంబం నుంచి వచ్చిన మా తాతయ్య, మా చిరంజీవిగారికి, ఆ తర్వాత సుకుమార్‌కు మాత్రమే చెప్పగలను. అందుకు కారణం కూడా చెబుతా. ‘ఆర్య’ అయిన నాలుగేళ్లకు అనుకుంటా..  నేను రూ.85లక్షల ఖరీదు గల కారు కొన్నా. ఆ  కార్‌ ఎక్కి స్టీరింగ్‌ పట్టుకుని ఒక్కసారి  నా కెరీర్‌ వెనక్కి వెళ్లా. ఇక్కడిదాకా వచ్చామంటే కారణం ఎవరై ఉంటారా అని ఆలోచించా.  నా మైండ్‌లో తట్టిన మొదటి వ్యక్తి సుకుమార్‌గారు. ‘డార్లింగ్‌ నువ్వు లేకపోతే నేను లేను. ఆర్య లేదు ఇంకేమీ లేదు’. పబ్లిక్‌లో ఎమోషన్‌ కాకూడదు అనుకుంటా. కానీ, కొన్నిసార్లు తప్పదు. స్టైలిష్‌స్టార్‌  నుంచి ఐకాన్‌ స్టార్‌ను చేసి,  ప్యాన్‌ ఇండియా  చూేసలా చేశారంటే నా కెరీర్‌కు సుకుమార్‌ ఎంత కంట్రిబ్యూషన్‌ ఇచ్చారో మాటల్లో చెప్పలేను’’ అని అన్నారు. ‘‘పుష్ప–2 తర్వాత ‘పుష్ప: వెబ్‌ సిరీస్‌’ చేయనున్నట్లు దర్శకుడు సుకుమార్‌ ప్రకటించారు. తన సినిమా కోసం పనిచేసిన కిందిస్థాయి సాంకేతిక నిపుణులకు ఒక్కొక్కరికి రూ.లక్ష ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ‘పుష్ప’ చిత్రం కోసం ేసకరించిన విషయాలతో సమగ్ర పుస్తకం తీసుకొస్తామని చెప్పారు. తన భార్య. పిల్లలకు కృతజ్ఞతలు తెలిపారు. 


Updated Date - 2021-12-29T00:01:10+05:30 IST