బ్యాచ్‌లర్ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్

ABN , First Publish Date - 2021-10-18T21:00:05+05:30 IST

అక్కినేని నవసామ్రాట్ అఖిల్ తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంతో హ్యూజ్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలైన రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఓవర్ సీస్ లో సైతం బ్యాచ్‌లర్ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతున్నాడు.

బ్యాచ్‌లర్ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్

అక్కినేని నవసామ్రాట్ అఖిల్ తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంతో హ్యూజ్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలైన రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఓవర్ సీస్‌లో సైతం బ్యాచ్‌లర్ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతున్నాడు. కరోనా సెకండ్‌వేవ్ నేపథ్యంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో చిత్రంగా ఈ సినిమా మరో ఘనత సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్‌మీట్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. సినిమాను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ.. ఈ మధ్యనే వైజాగ్ తో నిర్మాతలు థ్యాంక్స్‌మీట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గ్రాండ్‌సక్సెస్ ఈవెంట్‌ను హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు. దీనికోసం అల్లు అర్జున్ రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 19 సాయంత్రం 6 గంటలకు జెఆర్సీ కన్వెన్షన్‌సెంటర్ లో అత్యంత వైభవంగా ఈ ఈవెంట్ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి బన్నీ ఛీఫ్ గెస్ట్ గా విచ్చేస్తున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. జీఏ2 బ్యానర్ పై బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి పూజా హెగ్డే గ్లామర్ హైలైట్ గా నిలిచిపోయింది. ఇక అక్కినేని అఖిల్ కు ఈ సినిమా తన కెరీర్ లోనే మొట్టమొదటి మెమరబుల్ హిట్టైంది. మరి అల్లు అర్జున్ రాకతో బ్యాచ్ లర్ గ్రాండ్‌సక్సెస్ ఈవెంట్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి. Updated Date - 2021-10-18T21:00:05+05:30 IST