‘బంగారు బుల్లోడు’ బాలయ్యకు థ్యాంక్స్‌ అంటోన్న అల్లరోడు

ABN , First Publish Date - 2021-01-19T23:29:53+05:30 IST

అల్లరి నరేష్, పూజా జవేరి హీరోహీరోయిన్లుగా ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై గిరి పాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన

‘బంగారు బుల్లోడు’ బాలయ్యకు థ్యాంక్స్‌ అంటోన్న అల్లరోడు

అల్లరి నరేష్, పూజా జవేరి హీరోహీరోయిన్లుగా ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై గిరి పాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం "బంగారు బుల్లోడు". జనవరి 23న ఈ చిత్రం విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా చిత్రయూనిట్‌ మంగళవారం చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేసింది. 


ఈ కార్యక్రమంలో హీరో నరేష్ మాట్లాడుతూ.. ''పాండమిక్ తర్వాత సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అయి బాగా అడుతున్నాయి. మా అందరికీ చాలా నమ్మకం కలిగింది. బంగారు బుల్లోడు జనవరి 23న రిలీజ్ అవుతుంది. కథలో కామెడీ రన్ అవుతూ.. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా గిరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వెలిగొండ శ్రీను బ్యూటిఫుల్ డైలాగ్స్ రాశాడు. ఒక మంచి సినిమా చేశాం. సినిమా చూశాక చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. చాలా ఎగ్జైట్ గా ఉంది. సాయి కార్తీక్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. స్వాతిలో ముత్యమంత సాంగ్ రీమేక్ చేశాడు. ఎక్స్ ట్రార్డినరి రెస్పాన్స్ వచ్చింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ బాగా నటించారు. తప్పకుండా ఈ చిత్రం అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. బాలకృష్ణగారి బంగారు బుల్లోడుకి మా చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఒక బంగారు షాప్ లో వర్క్ చేస్తూ.. గ్రామీణ బ్యాంక్ లో పనిచేసే వాడి కథ. బంగారు తాకట్టు పెట్టుకొని రుణాలు ఇస్తుంటాడు. అందుకే ఈ సినిమాకి బంగారు బుల్లోడు టైటిల్ పెట్టడం జరిగింది. అడగ్గానే ఈ టైటిల్ ఇచ్చిన బాలకృష్ణ గారికి, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కి నా థాంక్స్..'' అన్నారు.

Updated Date - 2021-01-19T23:29:53+05:30 IST