అల్లరి నరేష్ ‘నాంది’ రిలీజ్ డేట్ ఫిక్సయింది
ABN, First Publish Date - 2021-02-06T01:17:33+05:30
అల్లరి నరేష్ విభిన్న పాత్రలో నటిస్తోన్న 'నాంది' చిత్ర విడుదల తేదీ ఫిక్సయింది. అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతోన్న
అల్లరి నరేష్ విభిన్న పాత్రలో నటిస్తోన్న 'నాంది' చిత్ర విడుదల తేదీ ఫిక్సయింది. అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతోన్న 'నాంది' చిత్రాన్ని ఫిబ్రవరి 19న విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఎస్వి2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తై, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 19న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ శుక్రవారం రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ పోస్టర్లో బ్యాగ్రౌండ్‌ను బ్లాక్ కలర్లో డిజైన్ ఉండగా.. జైలుగది లోపల కూర్చొని ఆలోచిస్తున్న అల్లరి నరేష్ కనిపిస్తున్నారు. గడ్డం పెంచుకొని ఉన్న నరేష్పైకి కిటికీలోంచి వెలుతురు పడుతుంది. ఈ పోస్టర్ చూస్తుంటే.. చిత్రం ఎంత విభిన్నతతో తెరకెక్కిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇదివరకు విడుదల చేసిన స్టిల్స్ కానీ, పోస్టర్లు కానీ నాంది సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తూనే వచ్చాయి. వాటికి లభించిన స్పందనతో చిత్ర బృందం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. నిర్మాత సతీష్ వేగేశ్న ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు సిద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.