ఆలియాభట్ పెళ్లి.. మళ్లీ వాయిదా?
ABN , First Publish Date - 2021-11-29T21:47:40+05:30 IST
బాలీవుడ్ ప్రేమపక్షులు రణబీర్ కపూర్, ఆలియాభట్ల పెళ్లి కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎదురుచూసే కొద్దీ పెళ్లి వెనక్కి వెళ్తూనే ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ డిసెంబర్లో ఈ జంట ఒకటి కావల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది ఏప్రిల్–మే నెలలో జరగనుందని బాలీవుడ్లో గుసగుసలు వినిపించాయి. అయితే మరోసారి ఈ జంట పెళ్లి వాయిదా పడిందని బాలీవుడ్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

బాలీవుడ్ ప్రేమపక్షులు రణబీర్ కపూర్, ఆలియాభట్ల పెళ్లి కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎదురుచూసే కొద్దీ పెళ్లి వెనక్కి వెళ్తూనే ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ డిసెంబర్లో ఈ జంట ఒకటి కావల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది ఏప్రిల్–మే నెలలో జరగనుందని బాలీవుడ్లో గుసగుసలు వినిపించాయి. అయితే మరోసారి ఈ జంట పెళ్లి వాయిదా పడిందని బాలీవుడ్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా సమాచారం ప్రకారం ఈ జంట పెళ్లి తంతును మరో ఏడాది వాయిదా వేశారని తెలుస్తోంది.
బిజీ షెడ్యూల్స్, ఇతర కారణాలతో వచ్చే ఏడాది డిసెంబర్లో పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నారట ఆలియా – రణ్బీర్. అయితే ఇద్దరు కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసి డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్లాన్ చేస్తున్నారట. విదేశాల్లో పెళ్లి అంటే ముందు నుంచే ప్రణాళికలు ఉండాలి కాబట్టి.. అన్ని పనులు పూర్తి చేసి కొంత వెకేషన్ తీసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకోనున్నారట. పెళ్లి వాయిదాకు మరో కారణం కూడా ఉంది. ఆలియాభట్ – రణ్బీర్ కపూర్ ఇద్దరూ కలల భవంతి వచ్చే ఏడాది మధ్యలో పూర్తి అవుతుందట. అది పూర్తయ్యాక ఇద్దరూ వివాహబంధంతో ఒకటి కానున్నారని సమాచారం.